ని

గ!

|

జా నా

గా / //

నన

న...

టల టపలలునుడో లి

౫!

నన న!

హాం

చాదళారాంచాది

క.

డా॥ గన్నువెంకటేశ్వర్లు 1.0.

నా గురుదేవులు, సర్వస్వము అయిన ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర స్వామి, నా ఇష్టదైవము అయిన ఆదిదైవము శ్రీ పరమేశ్వరుడు మరియు శ్రీ వీరభద్రస్వామి ప్రేరణ, కరుణా కటాక్షములచే పుస్తకమును వ్రాయగలిగిన నేను, నా స్వాములందరికి పాదాభివందనములు సమర్పించుచున్నాను. మాయ, అజ్ఞానాంధకారములలో పడి, అసహాయ స్థితిలో కొట్టుకులాడుచున్న నన్ను ప్రేరేపించి, ఆశీర్వదించి, ఆత్మజ్ఞానమును బోధించి అడుగడుగున ఆయన కరుణా కటాక్షములతో నన్ను ఉత్తేజపరచి, ఆత్మ సాక్షాత్కారమనబడు గ్రంథమును వ్రాయు స్థితికి ఎదిగేలా తీర్చిదిద్దిన నా గురుదేవులు అయిన శీశీనివాసులుయొక్క పాద పథృములళే గ్రంథము అంకితము చేయుచున్నాను.

హరిహరుల కృపచే సకల జీవకొటి తరించుదురుగాక.

8

మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్దయే యతతామపి సిదానాం కశ్చిన్మాం వేతి తత్త్వతః థి అం

వేలమంది మనుష్యులలో ఖ్‌ ఒక్కడో సిద్ధికొరకు యత్నించును. అలా యత్నించెడి వేలమందిలో ఎవడో ఒకడు నన్ను యదార్థముగా తెలిసికొనుచున్నాడు అని స్వయముగా శ్రీ గీతాచార్యుడే అర్జునునకు గీతయందు బోధించిరి.

స్వయముగా ఈశ్వరుదే వచ్చి నీకేమి కావలయును, నేను కావలయునా లేక పేరు ప్రతిష్టలు, ఆయురారోగ్య భోగభాగ్యములు కలిగి, కళత్ర-పుత్ర, పౌత్రులతోడి నూరేండ్ల సుఖజీవనము కావలెనా అని అడిగిన- కోటికెవడో ఒకడు తప్ప అందరును రెండవ వరమునే మరియే విచారణ లేకుండ పరమాసక్తితో ప్రార్ధింతురు.

ఆహా! ఇదియే కదా మానవుని అజ్ఞానము. ఇది అంతయు అవిద్యా ప్రభావము. నారాయణుడు సృష్టిలో ఇంద్రియములను లోపభూయిష్టముగా సృష్టించెను. మాయా ప్రభావము చేత మానవుడు చర్మ చక్షువులకు కనిపించు, ఇంద్రియభోగములలోనే సర్వము కలదని, అదియే తన గమ్యమని తలంచి, చివరకు భ్రష్టుడై జనన మరణ చక్రములలో బడి పతనమగుచున్నాడు. ఇదియే ఇంద్రియ జీవనము, దాని పర్యవసానము.

ఇంద్రియ జీవనములో గల ఇంద్రియ భోగములు నీచ నికృష్ణమై మోక్షమార్గమునకు అద్దు తలుగుచున్నవి.

పూర్వ జన్నార్జిత పుణ్యవశమునను, దైవానుగ్రహము వలనను దుర్లభమగు మనుష్య జన్మము ప్రాప్తించి, పురుష శరీరమును దాల్చి, సాంగ వేదాసారంగుందడయ్యును, మూఢుడు తన ముక్తి కొరకు ప్రయత్నింపక, అనిత్యమగు పుత్రకళత్ర విత్తాది సంగ్రహలోలుండగు

త్తే

చుండునో, వాడు దేహాభిమానముచే తనను తానే చంపుకొనునట్టి ఆత్మఘాతకుడగును. అనగా మోక్షము కొరకు యత్నించని మానవుడు ద్విపాద పశువు అనబడును.

శిష్యా! శరీరము తల్లిదండ్రుల యొక్క శుక్ర శోణితము వల్ల ఉత్పన్నమై, మలమాంస మయమై మిక్కిలి హేయమైనది. కనుక దీనిని అపవిత్రుడగు ఛండాలుని వలె త్యజించి, అనగా దానియందాసక్తిని వదలి, బ్రహ్మరూపమును పొంది కృతకృత్యుడవు అగుమని శ్రీ ఆదిశంకరుల వారు వివేకచూడామణిలో వచించిరి.

ఇట్టి నీచమైన ఇంద్రియ సుఖముల లక్షణములు క్రింది విధముగా గలవు.

య్‌ [0

9౫ రా

మద్య మద్య తెగిపోవునవి

కర్మను అభివృద్ధిపరచి అంతులేని జన్మలను కలుగజేయును. కొద్ది సుఖము తరువాత కొండంత దుఃఖమును తెచ్చిపెట్టును. ఎంత అనుభవించినను సంతృప్తి పడదు. ఇంకను అనుభవించ వలెనని కోరిక కలుగుచుండును. కోరికలను దినదినము పెంచుచుండును.

ఇది దృష్య వస్తువులపై ఆధారపదియున్నది.

ఇంద్రియ సుఖములు కర్మబంధములను దృథఢపరుచుచున్నవి. ప్రతిబింబ రూపమైయున్నది.

సముద్రములో ఒక నీటిబొట్టు వంటిది - అనగా బ్రహ్మానంద సాగరములో ఒక నీటిబొట్టు వంటిది.

10. అజ్ఞానులు ఆపేక్షించునవి. 11. జడమైనవి.

ఇన్ని అవలక్షణములు గల ఇంద్రియ జీవనమును కోరుకొను జీవుడు ఎంతటి అజ్ఞానియో ఎవరికివారే ఆలోచించుకొనవలయును.

ఇంద్రియ సుఖము ఎంత నీచ నికృష్ణమో, ఎంత హేయమో కైవల్య సుఖము లేక మోక్షము సృష్టిలో అంత ఉత్కృష్టమై యున్నది. నిజమునకు మానవునికిదియే గమ్యమైయున్నది. ఇందు జీవుడు పొందునది బ్రహ్మానందము.

అనాది కాలము నుండి జీవుడు సంసార బంధము నందు తగుల్మొని, అజ్ఞాన శృంకలములచే బద్దుడై తన స్వస్వరూపమును మరచి, తానే దేహమని భ్రమించుచు, నానా యాతనలు పడుచు, నానా పాప సంకల్పములు చేయుచు, జనన మరణ రూపమగు సంసార చక్రమందు బ్రమించుచున్నాడు.

కాని మోక్షస్థితి యందు జీవుడు శివుడుగా మారుచున్నాడు. నరుడు నారాయణుదై విలసిల్లు చున్నాడు.

భక్తుడు భగవంతుడై భాసించుచున్నాడు.

మానవుడు మాధవుడుగా పరిణమించుచున్నాడు.

జీవుడు మానవత్వమును వదలి దైవత్వమును పొందుచున్నాడు.

అది యొక అపూర్వ ఆనందనస్థితి. దుఃఖము లవలేషమైనను అచట కానస్పించదు. ప్రపంచములోని అన్ని లాభముల కంటెను అది గొప్ప లాభకరమైన స్థితియని శ్రీ గీతాచార్యులు పేర్కొన్నారు.

అచ్చోట జనులకు కలుగు ఆనందము వర్ణనాతీతము. కావున అట్టి స్థితియందు జీవత్వము అదృశ్యమై దైవత్వమే శేషించుచున్నది.

ఆనందసాగరమే యగు అట్టి దివ్యానుభూతి కొరకై మహనీయులెందరో తమ భౌతిక సంపదలకు తిలాంజలినొాసగి, వ్రాపంచిక సుఖములకు

6

దూరముగా విడచి వైచి రాజ్యాదులను గూడ తిరస్కరించి, అఖండ వైరాగ్యమును చేబట్టి, అమోవుమగు కృషి సలిపి తుట్టతుదకు విజయమును గాంచిరి.

అట్టి బ్రహ్మానందముతో భౌతిక సుఖములు పోల్చతగినవి కావు. ఒకటి నిత్యమైనది మరియొకటి అనిత్యమైనది. బింబసుఖము చెంత ప్రతిబింబ సుఖమెపాటిది.

జాగ్భతుని చెంత స్వప్న వస్తువునకేమైనా విలువయుండునా? కనుకనే శ్రీ శంకరులవారు (బ్రహ్మానందము విధంగా వర్ణించినారు.

బ్రహ్మానంద సముద్రము యొక్క లవలేషముతో సమానమైన కొద్ది సుఖమును పొంది ఇంద్రాదులు ఎంతయో సంతుష్టి పొందుచున్నారు. మునీశ్వరులు తమ చిత్తములను అట్టి పరబ్రహ్మమునందే లయింపచేసి బ్రహ్మానందమును బడయుచున్నారు.

బ్రహ్మము యొక్క భయము వలన, అనుగ్రహము వలన సృష్టి నడుపబడుచున్నదో అట్టి బ్రహ్మస్వరూపమైన బ్రహ్మానందమును క్రింది విధముగా తెలియబడినది.

మంచి యెవనములో ఉన్నవాడు, సాధు స్వభావము కలిగినవాడు, అధ్యాయుడు, అశళిష్టుడు, మనోదార్ధ్యము, దేహారోగ్యము కలవాడు అయి ఉండెడి విద్వాంసుడు ప్రపంచమునంతటిని ఎఏకచ్చత్రాదిపత్యముగా ఏలునట్టి సార్వభౌమునకు గల ఆనందమును “మనుష్యానందముగా” పేర్ళొనబడినది.

బ్రహ్మానందమునకు కొలతబద్దగా క్రమములో మొదటిదైన మనుష్యా నందము నిర్వచింపబడినది.

“ప్రపంచములో సుఖమును కలుగజేయు ప్రతీ విషయము బ్రహ్మానంద సముద్రములోని లవలేషమే”

"7

(బ్రహ్మానందము ఆనందమునకు పరాకాష్ట

అవిద్య, కామము, కర్మలు వీనియొక్క ప్రాబల్యము తగ్గిన కొలది, ఆనందము మనుష్య, గంధర్వ, దౌవ, హిరణ్యగర్భ ఆనందములుగా వృద్ధిచెందును.

బ్రహ్మానందము యొక్క వివరణ :- 100 గురి మనుష్యుల ఆనందము ........... ఒక మనుప్య గంధర్వానందము

100 గురి మనుష్య గంధర్వుల ఆనందము. ఒక దేవ గంధర్వానందము 100 గురి దేవగంధర్వాదుల ఆనందము.... ఒక పితృదేవతానందము

100 గురి పితృదేవతల ఆనందము ......... ఒక అజాన జానదేవతానందము 100 గురి అజాన జానదేవతల ఆనందము. ఒక కర్మదేవతానందము

100 గురి కర్మదేవతల ఆనందము .......... ఒక సురలోక దేవతానందము 100 గురి సురలోక దేవతల ఆనందము ... ఒక ఇంద్రుని ఆనందము 100 గురి ఇంద్రుల ఆనందము ............ ఒక బృహస్పతి ఆనందము 100 గురి బ్రహృస్పతుల ఆనందము ........ ఒక ప్రజాపతి ఆనందము 100 గురి ప్రజాపతుల ఆనందము.......... “బ్రహ్మానందము”

అందువలన, దీని నుండి అర్ధమగుచున్నదేమనగా మహారాజాది చక్రవర్తి అనుభవించు ఆనందము కంటె కోటానుకోట్ల రెట్ల ఆనందమే “బ్రహ్మానందము”

అట్టి ఆనందధామమును బడయుటకై, జీవుడు శక్తివంచన లేక పాటుపడవలసియున్నది.

మానవుడు జన్మించినది క్షణికముల కొరకు కాదు - శాశ్వత సుఖముల కొరకు.

దానవుడగుటకు కాదు - దేవుడగుట కొరకు.

పశుత్వమును పొందుట కొరకు కాదు - వపశుపతిగా మారుటకొారకు

“అట్టిచో ఎండమావుల వంటి క్షణిక సుఖములయందే జీవిత మంతయు ఆహుతి చేయనేల”

సున్నపు ముద్దలను జూచి వెన్నముద్దలని పరిగిడుట విజ్ఞుడు చేయవలసిన పనికాదు. తినుట, త్రాగుట, గంతులు వేయుట ఇదియేనా మానవత్వము.

వాస్తవముగా సుఖము బాహ్యమున లేదు. పదార్థములయందు సుఖమున్నదనుకొనుట వటి భమయే యగును. లై టి

నిజముగా సుఖము పదార్ధమందున్నచో అది అందరికిని ఎల్లవేళల యందును సుఖకరముగా తోచవలయును. అట్లు జరుగుట లేదు. ఒకే వస్తువు కొందరికి ప్రీతికరముగను మరికొందరికి అప్రీతికరముగను, ఒక కాలమున సుఖవంతముగను మరియొక కాలమున జుగుప్పాకరముగను స్ఫురించుచున్నది. వస్తువుననే నిజమైన ఆనందమున్నచో ఇట్లెన్నటికి సంభవించదు.

భోజనమునకు పూర్వము ఎంతయో రుచికరముగ తోచిన గారెలు, పాయసము, కడుపునిండ భుజించిన తరువాత, ఇక తినబుద్దిగాక, ఇంకను, ఎవరైన బలవంతముగ వడ్డించినచో విషప్రాయముగా భావించి పారవేయుదురు. “కడుపు నిండిన గారెలు చేదు” అను ఆర్యోక్తి సత్యమే కదా!

చేదు తనము గారెలలో లేదు. కమ్మదనము అంతకంటే లేదు. వారివారి ఆకలి, మనస్తత్వము, ఆయా రుచులను కల్పించుకొనుచున్నవి.

9

కాబట్టి సుఖము బాహ్యపదార్థముల యందు లేదు. జీవుని అవిద్యయే ప్రకారముగా వస్తువు సుఖభ్రాంతిని కలుగజేయుచున్నది.

ఒక కుక్క ఎచ్చటనో ఒక ఎముకను సంపాదించి దానిని కొరుకు చుండును. ఎముక గట్టిగా యున్నందున విరుగలేదు. కాని బలవంతముగా కొరుకుట వలన ఒక పన్ను ఊడిపోగా దాని నోటిగుండా నెత్తురు ఎముకపైబడి కారుచుందడెను.

య్‌

అమాయకమగు కుక్క ఎముకలోనుండి రక్తము కారుచున్నదని తలంచి, తన భాగ్యము పందెనని ఊహించి నిర్విరామముగా నెత్తురును నాకసాగెను. అట్టిదియే జీవుని అజ్ఞాన పరిస్థితి.

కావున బ్రహ్మమును తెలుసుకొన్నవాడు బ్రహ్మమేయగును అను వాక్యమును సదా జ్ఞప్తికి యుంచుకొని బ్రహ్మజ్ఞాన సముపార్దన ద్వారా, బ్రహ్మనిష్ట ద్వారా, సాక్షాత్‌ (బ్రహ్మస్వరూపులే అయి తమ తమ జీవితములను సార్దకమొనర్చు కొనవలయును.

ప్రతీ మానవుని యందును దైవత్వము గర్భితముగా యున్నది. బాహ్యంతర ప్రకృతినంతయు నిరోధించి, అంతర్గతమగు స్‌ దైవత్వమును వ్యక్తము చేయుటయే జీవుని జీవిత పరమావధియైయున్నది.

ఇందులకై జీవుడు సద్దురువునాశ్రయించి గురువు పర్యవేక్షణలో కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గములలో, ఒక్కటి గాని, కొన్నిటిని గాని అన్నిటిని గాని అవలంబించి ముక్తుడు కావలెను. ఇదియే మతసారము, తత్వసారము.

మతమనగా దైవసాక్షాత్మారమే. మీరెప్పుడు దేవుని సాక్షాత్మారము చేసుకొనెదరో అప్పుడే నేను మిమ్ములను దైవ భక్తుడని పిలిచెదనని శ్రీరామకృష్ణుల వారి ప్రవచనము. అట్టి లక్ష్యమును సాధించిన తరువాత మతమనునది నోటి మాటగానే మిగిలిపోవును. 10

భక్తుడు జగత్ర్రభువు యొక్క బిడ్ద. అతడు భగవంతుని కొరకై వదులు కన్నీటి బిందువులే అతని బలము. భగవన్నామము ఒక్కటియైనను వినినంతనే రోమములు గగుర్పాటు చెందుటయు, ఆనందాథ్రులు చెక్కిల్ల వెంట పొరలుటయు భక్తుని లక్షణములు. నీయందీ లక్షణములు గోచరించునపుడు, మోక్షము దగ్గరలో యున్నదని గ్రహింపుము. దీనిని సంకేతముగా (గ్రహించి సాధకుడు తన తత్వసాధనను తీవ్రతరము చేయవలయును.

సాధన చతుష్టయ సంపత్తి సంపూర్ణముగా గల శిష్యుడును, శృతిసార మెరిగిన బ్రహ్మనిష్టుడగు గురువు ఉండిన యెడల మాత్రమే బ్రహ్మవిద్య ప్రకాశించును. కాని ఉభయులలో ఎవరైనను పూర్తిగా లేనియెడల ఇది రాణించదు. అనగా ఇచ్చుకొనువారును త్రెచ్చుకొనువారును, ఉభయులును సమర్జులు కావలయును.

రోగము తెలిసిన వైద్యుని వద్ద సరియైన బెషధము ఉండిన రోగము కుదురును. అటులనే బెషధులు ఇచ్చినను, ఆహార పథ్యములు సరిగా చేయని యెడల మందు ఫలమీయజాలదు. ఆహారాదది పథ్యముల యందు జాగురూకుడైనను, బెషధము సరిగా లేని యెడల ఆరోగ్యము కలుగదు కదా!

శిష్యుడు శాంతుడై ఆత్మజ్ఞానము కొరకు పూజార్హ వస్తువులను కరమందు ధరించి, శృతిసారమెరిగినవాడై బ్రహ్మనిష్టుడైన గురువును ఆ(శశయింపవలయునని ముండకోపనిషత్తు తెలుపుచున్నది. దీనిచే గురుశిష్యులిరువురును యోగ్యులుగా ఉందవలయునని తేటతెల్లమగుచున్నది.

మహానుభావునిచే అవిద్యా హృదయ[గ్రంధి ఛేదింపబడి, మోక్షము కలుగునో వారినే గురువని గురుశబ్దార్దమెరిగిన పెద్దలు చెప్పుచున్నారు.

షే

'గు అను శబ్దము అంధకారమునకు పేరు. “రు అను శబ్దము దానిని నాశనము చేయు తేజస్సు అని అర్ధము. అనగా బ్రహ్మోపదేశముతో అజ్ఞానాంధ కారమును నాశము చేసి పరబ్రహ్మమును కరతలామలకము వలె చేయువారు గురు శబ్బమునకర్థమని “అద్వయతారకోపనిషత్తు” చెప్పుచున్నది.

గు కారము అనగా గుణాతీతము - రు కారము అనగా రూపాతీతము. అనగా నామమరూప రహిత అవస్థయగు బ్రహ్మమును తెలుపువాడే గురువని పెద్దలచే చెప్పబడుచున్నది.

చాతుర్యము కలవాడై, వివేకియై, ఆధ్యాత్మజ్ఞాన సంపన్నుడై, బహి అంతరశుద్ధికలవాడై ఎవని మనస్సు పవిత్రమై యుండునో వానికి మాత్రమే గురు శబ్ధము శోభిల్లును. కాని ఉదరపోషణ వరాయణులైన శుష్మవేదాంతులకు పదమందదు.

అత్యంత నిర్మల హృదయము కలవారై పరమశాంతులై సాధన చతుష్టయ సంపత్తి గుణములతో కూడిన సాధుస్వభావము కలవాడై మితభాషణము గలవారై, కామ (కోధమను అరిషడ్వర్గ ములను జయించినవారై, సదా సన్మార్గ ప్రవర్తకులై, చక్షుశ్రవణాది దశేంద్రియములను జయించినవారు మాత్రము గురువుల కర్షలు గాని ఇంద్రియలోలుర కథికారము లేదని సాక్షాత్తు పరమేశ్వరుడు గురుగీత యందు బోధించుచున్నాడు.

మరియు గురు లక్షణములు విధముగా వర్ణింపబడినవి.

1. త్రికరణముచే హింస చేయనివాడును బి, సత్యశౌచాదులు కలవాడును. 8. సమస్త జీవరాసుల యందు అపారమైన దయగలవాడును.

12

౨. ఇరాని... లా పై

షే. 12. 19. 15. 16.

షే 156. 19. ౨0. ౨1. ఐ2, 23. బడ

క్షమమతో కూడినవాడును

శాంతమైన చిత్తము కలవాడును నిగ్రహానుగ్రహ శక్తులు కలవాడును సదదాచారుడును

సమస్త విషయములయందు సమర్భుడును జపధ్యాన పరాయణుడును

. జ్ఞాన దీక్ష గలవాడును

గురుభక్తియందు ప్రాణము త్యజించువాడును

కర్మ, భక్తి జ్ఞాన, యోగములను క్షుణ్ణముగా ఎరింగినవాడును డంబాచారము లేనివాడును

క్షుద్రోపాసన లేనివాడును

సరేంద్రియ నిగ్రహము కలవాడును

శిష్యలయందలి గుణదోషములలో విశేష జ్ఞానము కలవాడును

రాగద్వేషములు లేనివాడును

కృపాసాగరుడును

సర్వదా జ్ఞాన సారమును గ్రహించు స్వభావము కలవాడును పరబ్రహ్మ స్వానుభవము కలవాడును

సర్వ సంశయములను ఛేదించినవాడును

క్షయ, కుష్టాది రోగములు లేనివాడును

వైరాగ్యముతో కూడినవాడును

సుందరుడును మమకారము నశించినవాడును

13

25. అహంకారము పోయినవాడును

26. శంకయుండనివాడును

27. వికల్ప శూన్యుడును

28. అజ్ఞానము నాశము పొందినవాడును

29. శాస్తసారమెరింగినవాడును

30. పరమార్దతత్వమైన బ్రహ్మమును విశేషముగా చింతజేయువాడును.

ఈలాంటి అనేక సుగుణములు కలవాడే సద్దురువు అని గ్రహించ వలయును.

ఇప్పుడు మనము అదేవిధముగా మోక్షసాధనకై తపించు శిష్యుని లక్షణములు గ్రహించవలయును.

శ్రీరాముడా! ఉపదేశము వ్యవస్థాపాలనము గురించి కాని, జ్ఞానసిద్దికి గాని శుద్దమైన ప్రజ్ఞాబలమే ముఖ్య కారణమైయున్నది.

థ్‌ ధా స్తు ర్‌ూ

కనుక శిష్యునకు 1) విషయ వైరాగ్యము, 2) మహా ప్రజ్ఞయు యుండవలయునని యోగవశిష్టము తెలుపుచున్నది.

ఎవని శిరమందు శ్రీరాముని పాదోదకము పడలేదో వాని తాపత్రయాగ్ని చల్లారదు.

ఎవరు గురోరుచ్చిష్టము భుజింపలేదో వారికి సంసార శాంతి లభించదు.

ఎవని శరీరముపై శ్రీశ్రీనివాసుని పాదధూళి పడలేదో వారి సంసార

మూ:

దుఃఖ వ్రణము మానుటకు మార్గములేదు.

ఎవడు పరమేశ్వరుని కృప కొరకై శరీరముతో పాటుపడడో వానికి ఇం(ద్రియని[గ్రహము సాధ్యము కాదు. అనాధిద్రైన అజ్ఞానమును మూలముగా నాశము చేయునదియు, జనన మరణములకు కారణమైన

మ్షేడ్త

కర్మమును నివారణ చేయదగినదియు యగు గురుపాదోదకము - జ్ఞాన వైరాగ్యసిద్ధి కొరకు, గురోరుచ్చిష్ట భోజనము శిష్యులకు మోక్షప్రాప్తికరమై యున్నది.

బాగుగా పరిపక్వమైన చిత్తము కలవాడును, విధి ప్రకారము శరణాగతిని పొందినవాడును అగు శిష్యునకు జ్ఞానము చేత సత్యమగు అక్షర పురుషుని కనుగొనునో బ్రహ్మవిద్యను గురువు శిష్యునకు సత్యముగా బోధించును.

చతుర్వర్ణముల యందు జన్మించిన వారెవరైనను సరె, శాస్త్రజ్ఞాన నిరూపకుండును, భక్తి జ్ఞాన, విరాగములచే సూక్ష్మబుద్ధి కలవాడును, నీతిమంతుడును, పురుషార్దమైన మోక్షమునకు సర్వదా ప్రయత్నశీలుడును సదా స్ధిర బుద్ది కలవాడును, గురు శుశూషయందాసక్తి కలవాడు, సర్వదా గురుకార్యము కొరకు పాటుపడువాడును గురు వచనోల్లంఘము నందు భయము కలవాడు, ఈలాంటి లక్షణములు కలవాడు శిష్యుదని చెప్పుదురు.

ఈశ్వరభక్తి యందు నిపుణులై, మద్య మాంసాది భోజనము లేనివారును, శూద్రులైనను, బ్రహ్మవిద్యా దీక్షను చేపట్టవచ్చును.

ఇక శిష్యులందరికి నూరు గుణములకన్నను అధికమైనవేవో వినుము- భక్తి, విశ్వాసము, అద్రోహము, శ్రద్ధ, పరమశాంతము, భూమివలె క్షమ, సత్యము, బహి అంతరశుద్ధి, తపస్సు, శాస్త్ర ఛవణము ద్వాదశ గుణములెవరికి గలవో వారు ప్రధానులని చెప్పవలెను.

అహింస ఆర్జనము సత్యము క్షమ ఆప్రేయము దృతి బ్రహ్మచర్యము మితాహారము దయ శౌచము

అను 10 విషయములు దమమనబడును. 15

తపస్సు వేదాంత శ్రవణము

సంతోషము లజ్జ ఆప్రిక్యము మతి దానము జపము

ఈశ్వరోపాసము -- వ్రతము అను 10 విషయములు నియమమనబడును.

1) విధి ప్రకారము కర్మలు చేయువాదును

2) కామ సంకల్పము లేనివాడును

8) సంసార సంషు విసర్జియుడును

4) కామ (కోధములను జయించినవాడును

5) సత్య ధర్మ పరాయణుడును

6) గురుసేవ యందు ఆసక్తి కలవాడును

(7 తల్లిదండ్రులను పూజించువాడును

8) సదాచారము కలవాడుగా శిష్యుడు ఉండవలయును.

మోక్షమునకు మొట్టమొదట అభ్యసించవలసినవి.

1) మితభాషణము

2) పరిగ్రహ విసర్జితము

38) ఆశ లేకుండుట

4) కోరికలను నాశము చేయుట 5) ఏకాంతమునందుండుట

అని వివేకచూడామణి చెప్పుచున్నది.

మనస్సు నశించి పరబ్రహ్మస్థితి కలుగుటకై నాలుగు సాధనములు సాధకునకు అత్యావశ్యకమైయున్నవి.

16

అవి నిత్యానిత్య వస్తు వివేకము ఇహాముత్ర ఫలాభోగ విరాగము శమాది షట్క సంపత్తి

శమము తితీక్ష దమము -క

ణం

ఉపరతి సమాధానము

ముముక్షత్వము

1. కొందరు ఆగమశాస్తమను వలయందు చిక్కియు

11. కొందరు వేదశాస్తములను చదవి చదివియు కాలము వ్యర్థపుచ్చును

111. మరికొందరు పరమానువాదమైన తర్మశాస్త్రమునవలబించియు

11- మరికొందరు ఆత్మచితన లేక సంసార సాగర తరుణోపాయము తెలియక దుఃఖమునకు పాత్రులై నాశము పొందుచున్నారు.

కనుక జీవుడు

ఎక్కువ ప్రశ్నలను నిలిపి

గురు, దైవభక్తితో కూడి

కొంతకాలము జనబాహుళ్యములేని నిర్మల ప్రదేశము చేరి

అవన్థాత్రయ సాక్షియె

పంచకోశ విలక్షుణుడైన స్వస్వరూపస్థితిని ధ్యానించి

బ్రహ్మానంద నిర్వాణ సుఖమును పొందుగాక.

17

జి. “బ్రహ్మ సత్యం జగత్‌ మిథ్య”

అను వెదథశుతిని సాధకుడు, దాని గూఢథార్థమును బాగుగా ఆలోచించి గ్రహించవలయును.

ప్రతీ మానవుడు జనన మరణములు లేకుండ మోక్షము కొరకు 'ప్రయత్నించవలనియున్నది. జనన మరణముల నుండి విముక్తి పొందాలంటే, సృష్టిలో గల 84 లక్షల జీవరాసులతో ఒక మానవజన్మకే హక్ష్మును భగవానుడు ప్రసాదించియున్నాడు. ఇతర జీవరాసులకు యోగము బహు దుర్లభమ్రైయున్నది. ఇంద్రుడంతటివాడైనను, మోక్షసాధనకై నరజన్మమెత్తవలసినదే అని శ్రీ శంకరులవారు వచించిరి.

ఆత్మ సాక్షాత్కారము కలుగగానే ప్రపంచము శూన్యములోనికి అదృశ్యం అయిపోతుందని శ్రీ గౌడపాదుల వారు విశ్వసింపలేదు. అంతా అలాగే ఉంటుంది. అయితే అది సత్యమని మాత్రము భావించము. అందుచేత దానియందు ఆసక్తి ఉంచుకొనము. సాక్షాత్కారము యొక్క ఒక్కగానొక్క ఫలితము ఇదే. ఆసక్తి ఒక్కటే బంధ కారణము అవడము చేత సృష్టి అంతా ఆత్మయే అని సాక్షాత్మరించుకొన్న తరువాత జీవుడు ఇక బంధము పెంచుకొనదడు. కనుక జీవన్ముక్తి మాత్రమే తత్వచింతనకు, ధార్మిక జీవనానికి పరాకాష్ట అదే వాటికి ఒక్కగానొక్క బుజువు, ఆలంబనము. దానిని సాక్షాత్మరించుకొన్నప్పుడే నిజమైన బ్రాహ్మన్యం సిద్ధిస్తుంది.

అందుచేత సాధకుడు జగత్‌ మిథ్య అని, సాధనలన్ని అనావశ్యకమని తొందరపడకూడదు.

18

జగత్తు గురించి

అజాాని త్త

- సాధకుడు జీవన్ముకుడు (ఆత్మసాక్షాత్మారము తరువాత)

క్రింది విధములుగా ఆలోచించుచు, 8 రకములుగ వేరు వేరు ఫలితములను పొందుచున్నారు.

అజ్ఞాని :- అవిద్యా ప్రభావము చేత సృష్టిలోని ఇంద్రియ సౌఖ్యాలే జీవుని అంతిమ గమ్యమని తలంచి వాటివెంట పరిగెడుచు, న్యాయాన్యాయ విచక్షణను కోల్పోయి ధర్మాధర్మ విచక్షణా జ్ఞానమును పరిత్యజించి, విషయముల యందు ప్రవర్తించి, పతనమై జనన మరణ చక్రములలో పరిభ్రమించుచున్నాడు.

సాధకుడు :- సద్దురువు, సాధకునకు మాత్రమే “జగత్‌మిథ్య' అని బోధించుచున్నాడు. ఇదియు కూడ కేవలము ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము పొందించుటకు మాత్రమె, గురువు శిష్యునకు విధముగా బోధించుచున్నాడు.

సర్వకాల సర్వావస్థల యందు సాధకుడు “జగత్‌ మిథ్య” అను ఆలోచనా అభ్యాసముల చేత క్రమక్రమముగా, మనో నిగ్రహమును, తరువాత మనో వైరాగ్యమును సాధించుచున్నాడు. మరియు ఇంద్రియ జీవనమునకు దూరము కాగలుగుచున్నాడు.

మరియు సత్మర్శలు, నిష్మామ కర్మలు, పుణ్యకర్మలు ఆచరించుచు అంచెలంచెలుగా వృద్ధి చెందుచు చివరకు భక్తి జ్ఞాన, వైరాగ్యములచే బ్రహ్మ సాక్షాత్మారమును పొందుచున్నాడు.

19

కావున “జగత్‌ మిథ్య” అను శృతి సాధకునకు మనో వైరాగ్యమును పెంచుటకు ఆపైన బహ్మసాక్షాత్మారమును త్వరితముగా సిద్ధించుకొనుటకు చేయబడిన ప్రక్రియ మాత్రమే.

ఆత్మజ్ఞాని, జీవన్ముక్తుడు :- “సర్వం ఖతిదం బ్రహ్మ” అని తెలుసుకొన్న (బ్రవ్మావిధుడు, పాంచభౌతికమగు ప్రపంచమును పరిహసింపడు, నిందింపడు. అంతియేగాక సృష్టిని భక్తి భావముతో, బ్రహ్మభావముతో చూచును. బంధము కలుగజేయునది మనస్సుగాని, వస్తువు కాదుగదా! అని గ్రహించి బంధ రహితుడై యుండును.

కర్మలనయినా, ఈశ్వరార్పణగా, ఫలాపేక్ష రహితముగా, సృష్టి చట్టమును అతిక్రమించక ఆచరించుటలో ఏమాత్రము దోషములేదు. నిజమునకు విషయాసక్తియే బంధము, అనాసక్తియే మోక్షము. శ్రోత్రియ బ్రహ్మనిష్టునకు సర్వ ప్రపంచములోని, భోగ్యవస్తుసామాగ్రి కరతలా మలకముగా యున్నది. అతడు దానిని అనుభవించుచున్నను, అతని ఆనందము అపారము అని బ్రహ్మానందవల్లిలో తెలుపబడినది. ఏలననగా అతడు ఎన్నడును సృష్టి చట్టమును అతిక్రమించడు. కనుక బ్రహ్మజ్ఞాని దేనిని నిందింపడు. అతడు

1) ప్రాప్తించిన లేషమునైనను బ్రహ్మభావముతో భుజించి, నిత్యతృప్తుడై, నిరాశయుడై, ఆనంద స్వరూపుడై యుండును. లై సర్వకర్మలను, అతడు ఈశ్వరార్చణతో ఫలాపేక్ష రహితముగా లోకసంగ్రహార్దము సృష్టియొక్క చట్టమును అతిక్రమించకుండద ఆచరించును. 20

ఇవియును గాక శ్రీగీతాచార్యుడు కర్మానుష్టాన విశేషములను (క్రింది విధములుగా తెలిపెను.

కే

కక

111.

కర్మసన్యాసమును, కర్మయోగమును రెండును మోక్ష దాయకములే కాని రెంటిలో కర్మయోగమే శ్రేష్టమైనది.

జ్ఞానయోగుల చేత న్ధ్థానము పొందబడుచున్నదో స్థానమే కర్మయోగులచేత కూడ పొందబడుచున్నది. జ్ఞాన కర్మలను రెంటిని ఒకటిగా ఎవడు చూచుచున్నాడో వాడే సృష్టిని నిజముగా చూచువాదై యున్నాడు.

అర్జునా! నాకు ముల్లోకములయందు చేయదగిన కార్యము ఏదియును లేదు. పొందబడనిదియును, పొందతగినదియును అగు వస్తువు ఏమియును లేదు. అయినను నేను కర్మలనాచ రించుచున్నాను.

నేను అప్రమత్తుడనై కర్మలనాచరింపకుందునేని, జనులు సర్వ విధముల నా మార్గమునే అనుసరించుచు ప్రవర్తించు చుందురు.

నేను కర్మలను చేయనియెడల, లోకములన్నియు నశించును. వర్ణ సంకరమునకు నేను కారణమగుదును. జనులను చెడిపినవాదనగుదును.

అర్జునా! అజ్ఞానులగు జనులు ఫలాసక్తి కలిగి విధముగా కర్మలనాచ రించుచున్నారో అలాగే జ్ఞానులు ఫలాపేక్ష లేకుండా, లోకసం[గ్రహార్తము కర్మలనాచరింపవలెనని శ్రీకృష్ణపరమాత్మ శాసించెను. దీనినే “దగ్గపటన్యాయమని” అందరు.

బే

1. అర్జునా! నీకు కర్మజేయుటయందే అధికారము కలదు

కర్మవలము నాశించుటకు అధికారము లేదు. కర్మ ఫలమునకు నీవు కారణభూతుడవు కారాదు అని కర్మలను చేయుట మానరాదు.

జీవుడు దేహమున్నంత పర్యంతము నిష్కామ కర్మలను, ఈశ్వరార్చనతో చేయుచునేయుండవలయును. ఇదియే గ్రేష్టమైన యోగము.

జన్మలకు కర్మఫలమే కారణమైయున్నది. అదే విధముగా మోక్షమునకు కర్మల "౧౭౫౫౦6" కారణమైయున్నది. అనగా కర్మ-అకర్మముగా మారవలసియున్నది.

ఈశ్వరార్పణ ఫలాపేక్షరహితము కర్మ టూ అకర్మ స్వధర్మానువ్చానము లోక సం[గ్రహార్దము కర్మయోగముగా మారవలెనన్న పైన ఉదహరింపబడినటుల ఒక 662401 గా చెప్పుకొనవచ్చును.

జీవునకు కర్మలయందు 01622006 లఖించినచో, (క్రమముగా

భగవదనుగ్రహముచే ఆత్మజ్ఞానము పొంది పరమాత్మలో ఐక్యమగుచున్నాడు.

ఆత్మ సాక్షాత్మారము లభించిన తరువాత కూడ బ్రహ్మజ్ఞాని ప్రారబ్ద కర్మఫలము అనుభవించియే తీరవలెను. అందుచే జీవన్ముక్తుడు కూడా సృష్టిని ఈశ్వరభావముతో చూచుచు

22

నిష్మామ కర్మలను, సత్మర్మలను, పుణ్యకర్మలను లోక సంగ్రహార్దము ఆచరించుచునే యున్నాడు.

1711. జీవుడు కొన్ని కల్పములయినను కర్మఫలము నుండి తప్పించుకొన లేడని వేదములు ఘోషించుచున్నవి.

7101. బాగుగా నాచరింపబడిన పరధర్శ్మము కంటెను, గుణము లేనిదైనను స్వధర్శమే ్రేష్టమైనది. స్వధర్శము నందు మృత్యువు కలిగినను గ్రేష్టమే. పరధర్మము భయంకరమైనది.

కర్మలను త్యజించి సోమరిగా కూర్చొనుట భగవంతుని ఆశయము

కాదు. కనుక కర్మలను విడుచుటకంటే చేయుటయే మేలని చెప్పియుందెను.

వారి వారి స్వకర్మలను ఆచరించుకొనుచు, దైవార్పణ బుద్ధి కలిగి వానిలో తగుల్కొనక, కర్త లత్వమును వహింపకయుండినచో కర్మలన్నియు పూజలు గాను, యజ్ఞములుగాను మారును.

అనగా

పాకివాడు - పాకి పని చేసికొనుచు వంటవాడు - వంటపని చేసికొనుచు మాదిగవాడు - చెప్పులు కుట్టుకొనుచు వర్తకుడు - వ్యాపారము చేసికొనుచు ఆఫీసరు - ఉద్యోగము చేసికొనుచు

పురోహితుడు. - పౌరోహిత్యము చేసికొనుచు తరించుటకు అవకాశములు కలవని గీత బోధించుచున్నది.

కాకున్నచో, కర్మనయినను ఫలాపేక్ష రహితముగా ఈశ్వరార్చణగా క్‌ సృష్టి చట్టమునతిక్రమించకుండ చేయవలయును

23

అప్పుడు కర్మలన్నియు యజ్ఞములుగా యోగముగా మారును.

కనుకనే కాబోలు శ్రీకృష్ణుడు బండితోలు పదవి స్వీకరించి అదియును ఏమంత తక్స్కువైనది కాదని బుజువు చేసెను. అంతియేకాదు, సంధ్యాకాలమున యుద్ధమును విరమించి అందరు అర్థ్యపాదములు ఇచ్చుచుండ, గుజ్జములకు తగిలిన గాయములను నదిలో కడిగి పిమ్మట వానికి గుగ్గిళ్ళను తినుపించు చుండెనట శ్రీకృష్ణపరమాత్మ.

కావున ఫలాని కర్మ తక్కువని కాని, ఫలాని కర్మ ఎక్కువని కాని భావింప రాదు. అన్నియు పవిత్రములే. వాని నొనర్పు పద్ధతి యందు, మనోభావము నందు మార్చు రావలయును.

వేదాంతమును వ్యవహార స్థాయికి దింపుటయు, వ్యవహారమును వేదాంత స్థాయికి పెంచుటయు గీతయొక్క చాతుర్యము.

గీతయంతయు వినిన తరువాత అర్జునుడు జోలి ఎత్తుకొని బిక్షాటనము చేయుచు అరణ్యములకు పారిపోలేదు - సరికదా రణరంగమున నూతనోత్సాహముతో దుమికి క్షత్రియోచితమగు తన యుద్ధకార్యమును ఆనందముగా నెరవేర్చెను.

ముక్కుచు మూలుగుచు కూర్చున్నవానిని కర్తవ్య నిష్టునిగా నొనర్చిన ఘనత గీతకే చెల్లును

ఇట్లు ఒక్క అర్జునుడే కాదు, మరెందరో ధర్మ రహస్యమును గుర్తెరింగి నిష్మామ కర్మాచరణ రూపమగు దివ్యాబెషధమును భుజించి వారి వారి వ్యవహారములను, గృహ కార్యములను, లోక కార్యములను, అనాసక్తముగా నాచరించి శాంతి సౌఖ్యములను బడిసిరి.

కావున గీతాశ్రవణముచే మాదిగవాడు - చెప్పులను ఇంకా బాగా కుట్టును

ర!

వంటవాడు - వంటను ఇంకను చక్కగా చేయగలడు

వ్యాపారి - ఇంకను శ్రేష్టముగా, న్యాయముగా, బాగుగా వ్యాపారము చేయును.

ప్రకారముగా భగవద్గీత భౌతిక ఆధ్యాత్మిక రంగములు అని రెండు విధములుగా లేవనియు, మరియు ఒకటేననియు, భౌతికరంగమున ఆధ్యాత్మికతను వ్యాపింపచేయవచ్చునని సోపత్తిగా బుజువు చేసి రెండిటి మధ్యనున్న అఘాతమునకు చక్కని వారధిని నిర్మించెను.

కర్మలు జదడములే కాదనలేము. కాని మోక్ష సాధనలో ఇవి తొలిమెట్టులై యున్నవి. అనగా కర్మయోగమును - 43985 గా అనగా ౧6ల 61262401 తో పోల్చవచ్చును.

కావున సాధకుడు విద్యుక్తధర్మములు, సత్మర్మలు, పుణ్యకర్మలు, నిష్కామ కర్మలు విరివిగా చేసికొన్నచో ఇందు ఉత్తీర్ణుడై రండవమెట్టు యందు గల భక్తియోగము నందు ప్రవేశించుచున్నాడు. ఇది 14.0. అనగా 051 (12002401 తో పోల్చవచ్చును.

ఇందు సాధకుడు పరాభక్తుడై సాకార ఇష్టదెవానుగ్రహము, ధర్భనము పొంది, మూడువ అనగా ఆఖరు మెట్టయందు గల జ్ఞానయోగము నందు ప్రవేశించుచున్నాడు. ఇది ౨.4. అనగా 5*0ల 5060121124401 తో పోల్చవచ్చును.

ఇందు భగవదనుగ్రహముచే సృష్టియందు గల పంచ భ్రమలు తొలగి ఆత్మజ్ఞానమును సిద్ధింపచేసికొని పరమాత్మలో ఐక్యమగుచున్నాడు.

ఇదియే కర్మ, భక్తి, జ్ఞాన యోగముల సారాంశమని సంక్షిప్తముగా చెప్పవచ్చును.

25

93.

మనస్సు ముట్ది టు జీవాంశ దైవాంశ

కృష్ణుడు : ఆయా జీవులు చేయునట్టి పాపపుణ్యములు ఆత్మను అంటజాలవు. అవి ఆయా జీవులనే చేరుచున్నవి.

అర్జునుడు : ఇదియేమి అన్యాయము? ఆత్మ జీవులతో సంబంధించిన సకల కార్యములను తానే చేయించుచుండగా, ఆత్మకు అంటదనియు, జీవులకే అంటుననియు చెప్పుచున్నావు. అందులకు గల కారణమును వివరించుము.

కృష్ణుడు : జీవులు మాయచే కప్పబడియున్నందున తాను చేయుచున్న కార్యములను తానే చేయుచున్నానని అహంకారమును పొందుచున్నాడు. అందువలన కర్మమును వాదే అనుభవించవలసి యున్నది.

అర్జునుడు : ఏమియు తెలియని జీవుడు తాను చేయని కార్యములను నిర్నినిమిత్తముగా తనమీద మోపుకొని ఎందుకు పాపమును మూటకట్టుకొన వలయును.

కృష్ణుడు ; తనకు తెలివిలేని తనమున అట్లు చేసుకొనుచున్నాడు. తెలివిలేని తనమే సమస్త జంతువులయొక్క జ్ఞానమును మూసివేయు చున్నది.

“ధూమేనా వ్రియతే వహ్నిర్యథాధర్నోమలేనచ యథోల్సే నావృతో గర్బస్థథా తేనేద మాదృతమ్‌” 26

పాగచేత నిప్పు, మురికి చేత అద్దము, మావిచేత శిశువు, కామము చేత జ్ఞానము కప్పబడియున్నవి.

అర్జునుడు : ప్రపంచోత్పత్తికి కారణకర్తగా నుండు ఈశ్వరుడు మాయను కలుగజేసి మాయవలన జీవులను మోహింపచేసి దానివలన కలిగెడు కర్మలను వారి నెత్తిన నుంచుకొనునట్లు చేసి, ఆత్మ తానేమి చేయనివానివలెయుండుట ధర్మమా?

కృష్ణుడు : పరమేశ్వరుడు మాయతో కూడ జీవులను సృష్టిచేసి పంపించినను మాయనుండి తప్పించుకొనుటకు బుద్దియనెడి శక్తిని కూడ పంపించి యున్నాడు. బుద్ధిని వారు సరిగా ఉపయోగించు కొననందున, కర్మమనెడి మూటను తాను మోసుకొనవలసి వచ్చుచున్నది. కాని భగవంతుడు నిజముగా జీవులను కర్మకు లోబడునట్లు చేయలేదు.

ఒకని కడ ఇరువురు సేవకులుండిరి. యజమానుడు సేవకులను పిలిచి మీరు అర్ధరాత్రమున కటికచీకటి యందే లేచి నేను మీతో మునుపు చెప్పిన పనికి గాను చెరియొక ఊరు పోవలసియున్నది. కాని మీరు పోవు మార్గమధ్యమున అక్కడక్కడ దిగుడు బావులు కలవు. అవి పైకి కనపడవు. చీకటిలో తెలియక అడుగిడినచో వాటియందు వడి ప్రాణములను పోగొట్టుకొనగలరు.

కావున ఇదిగో! రెండు దీపములను మీకు చెరియొకటి ఇచ్చుచున్నాను. వాటిని మరువక తీసికొనిపోయి పనిని త్వరగా నెరవేర్చుకొని రందని చెప్పి పంపెను.

ఇరువురు సేవకులలో ఒకడు యజమానుడిచ్చిన దీపమును తీసికొని వెళ్ళి యజమానుని ఇష్టానుసారముగనె పనిని నెరవేర్చుకొని వచ్చిను.

బ/

కాని రెండవ సేవకుడు యజమానుడు చెప్పిన రీతిని చేయక దీపమును ఇంటియందే యుంచి కటిక చీకటిలో బయలుదేరెను. అట్లు వెల్లుచుండగా దానిలో గల ఒక నేలబారు బావిలో చూడక పడి, ఈత రానందున, ముమ్మారు మునిగి ప్రాణములను వదిలెను.

కావున ఇట్లే పరమేశ్వరుడిచ్చిన బుద్దియను దీపమును సరిగా ఉపయోగించని జీవుడు బావి వంటి మాయలోపడి జననమరణాది దుః ఖములను పొందుచున్నాడు విధముగా బుద్ధిని సరిగా ఉపయోగించని మానవుడు మాయవలన కలిగెడి కర్మఫలములను తానే అనుభవించు చున్నాడు.

ప్రతీ వ్యక్తి చెడ్డపని చేయుటకు ఉపక్రమించుటకు ముందు, పరమాత్మ బుద్ధిరూపములో అది వలదని హెచ్చరించుచునే యున్నాడు. కాని జీవుడు మాయా ప్రభావము చేత అంతరాత్మ హెచ్చరికను పెడచెవిన పెట్టి - నేను చేయు పనిని ఎవడు చూచుచున్నాడులే అని బ్రష్టమైన ధైర్యములో అధర్మమైన పనులను చేసి - పతనమగుచున్నాడు. ఎందుకనగా పరమాత్మ సృష్టిలోని ప్రతీ చర్యను అనుక్షణము గమనించుచునే యున్నది.

కావున ఎవడైతే దైవాంశమైన బుద్ధియొక్క హెచ్చరికను ప్రమాణముగా తీసికొని దుష్కార్యములకు దూరముగా ఉండుచున్నాడో వాడే నిజముగా తరించు చున్నాడు.

ఎవడైతే చంచలమైన మనస్సు కోరుకొను విషయవాంఛలపై వ్యామోహముతో పరిగెడుచున్నాడో వాడు పతనమగుచున్నాడు.

28

డ్త్త ద్వైత అద్వైత విశిష్టాద్వైతములు

సంక్షిప్తముగా ద్వైత మనగా జగత్తు, ఆత్మ పరమాత్మ అన్నియు సత్యములే విభిన్నములే.

అద్వైత మనగా అంతా ఒక్కటే. రెండూ లేవు. అహం బ్రహ్మ

విశిష్టాద్వైతము అనగా ప్రకృతి, ఆత్మ, పరమాత్మ వేరు వేరు. ప్రకృతి, ఆత్మలు పరిణామశీలాలు. పరమాత్మ మారడు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములని చతుర్విధంగా ఆత్మ మోక్షమును పొందును. అదియే లీనమగుట, కలియుట, సాయుజ్యము పొందుట మోక్ష ప్రాప్తి.

శ్రీ శంకర భాగవత్పాదులు వేదాంత పరంగా, కఠినతరంగా, వేదాంత పరిభాషలో చెప్పగా, శ్రీమద్వాచార్యులు, భగవద్రామానుజా చార్యులు, లౌకిక పరంగా సులభంగా, సామాన్య పరిభాషలో విదదీసి చెప్పినారు.

నిజమునకు ద్వైత, అద్వైత, విళిష్టాద్వైెతముల యొక్క తాత్పర్యమును అర్ధము చేసికొనవలెననిన- ఆంజనేయుడు శ్రీరాముని ప్రార్ధించుచు పల్మిన పలుకులను మననము చేసికొనవలయును.

దేవా! 1) దేవా బుద్ధితో నేను నీకు దాసుడను (ద్వైతము)

ల) జీవబుద్ధితో నీ అంశను (విశిష్టాద్వైతము)

29

8) మరియు ఆత్మబుద్ధితో నీవే నేను. (అద్వైతము) ఇది ఆంజనేయుని నిశ్చయము.

నిజముగా దేని తత్వము దానిదే. సందర్భములో తత్వము దేనిని గురించి వివరించుచున్నదో తత్వమును సాధకుడు మననము చేయవలయును.

ఉదాహరణకు జ్ఞానాద్వైతము పనికివచ్చును గాని కర్మలాచరించు నపుడు కర్మాద్వైతము పనికిరాదు.

సర్వము బ్రహ్మమేయని ఒక శిష్యునకు గురువు బోధించెను. శిష్యుడు దానిని మక్కికి మక్కిగా అర్ధము చేసుకొనెనేగాని దాని అంతర్యమును గ్రహింపడాయెను.

ఒకనాడతడు రాజవీధిన పోవుచుండగా ఏనుగెదురాయెను. పైనున్న మావటివాడు తొలగుడు, తొలగుడు అని అరచుచుండినను, బ్రహ్మచారి (శిష్యుడు) నేనేల తొలగిపోవలెను, నేనును బ్రహ్మమే ఏనుగూ బ్రహ్మమే కదా. బ్రహ్మమునకు తనవలెనే ఏల అపాయము కలుగును? అని తనలో తాను వితర్మించుకొనుచు కదలడాయెను. తుదకు ఏనుగు వానిని తొండముతో పట్టి ప్రక్కకు విసిరివేసెను. బ్రహ్మచారికి బలమైన గాయములు తగిలెను. కొంత వడికెట్లో గురువుగారి యొద్దకు పోయి జరిగిన వృత్తాంతమును అంతయు విశదీకరించెను. అప్పుడు గురువు శిష్యున్నిట్లు మందలించెను. మంచిది! నీవును బ్రహ్మమే ఏనుగు కూడ బ్రహ్మమే. కాని మావటి బ్రహ్మము తొలగిపొమ్మని పైనుండి నిన్ను హెచ్చరించెను గదా! బ్రహ్మము మాట నీవేల వినవైతివి.

80

విశ్వమంతయు (బబ్రవ్మవేయని ప్రకటించు అద్వైత సిద్ధాంతమును ఒక రాజుకు వాని గురువు బోధించెను. సిద్ధాంతము రాజునకు బాగుగా నచ్చిను.

అంతఃపురమునకు పోయి ఆతడు రాణితోనిట్లనెను. రాణికిని రాణి దాసికిని బేధమేమియు లేదు. కాబట్టి దాసియే ఇంతటి నుండి నారాణీి యగును. తన భర్తయొక్క విచ్చి ప్రసంగమును విని రాణి నిశ్చేష్టురాలయ్యెను. ఆమె యా గురువును పిలిచి- అయ్యా మీ బోధనలయొక్క దుష్పలితమెట్లున్నదో చూడుడు అని మొదలిడిచు జరిగిన వృత్తాంతమును వివరించెను. గురువు రాణినోదార్చుచు ఇట్లు పలికెను. నేడు రాజునకు నీవు భోజనమిడు సమయమున అన్నముతో పాటు ఆవు పేడను గూడ పల్లెమున వడ్డింపచేయుడు. మిగిలినది నేను చూసుకొనెదనని రాణికి తెలిపెను.

భోజన సమయమందు గురువును, రాజును కలిసి భోజనమునకు కూర్చుందిరి. అన్నముతో పాటు వడ్డింపబడిన ఆవుపేడను చూచినంతనే రాజునకు కలిగిన ఆగ్రహమెట్టిదో ఊహింపనగును. దీనిని కనిపెట్టిన గురువు మందహాసము చేయుచు మెల్లగానిట్లు ప్రశ్నించెను. దేవరవారు అద్వైత జ్ఞానము కలవారు కదా! అన్నమునకును ఆవుపేడకును బేధము నేల పాటింపవలెనో కదా? రాజంత పట్టరాని కోపముతో ఇట్లరిచెను- 'మహా ఆద్వైతి నని చెప్పుకొను మీరే చేతనైనచో పేడ తినుడు. గురువంతట వెంటనే సూకరముగా మారి లొట్టలు వేయుచు పేడను భక్షించి మరల మానవరూపమును ధరించెను. రాజంతట సిగ్గు తెచ్చుకొని మరల ఎన్నడును రాణితో వట్టి పిచ్చి ప్రసంగము చేయలేదు.

విలీనమనగా కరుగుట, కలియునది అని ముఖ్యార్ధము అనగా నామరూపాలు లేకుండగా నిజతత్వాన్ని వదలి ఇతర తత్వాలతో కలియుట

3

కాదు. మారుట కాదు. దేని తత్వము దానిదే. “మహాదాకాశంలో అల్పాకాశం కలసిపోతుంది. కాని అదే తిరిగి వలసి వచ్చినపుడు వేరౌతుంది”

ఒక మనిషి ఇంటిలో నుండి వెడలి గుంపులో నున్న మనుషులతో కలసినాడంటే అర్థమేమి? నామరూపాలు లేకపోయినాదని అర్థమా? కాదు గదా! కొంత దూరము గుంపులో వెడలినను తర్వాత తిరిగి వెడలినప్పుడు నిజనామ రూపాలు అగుపిస్తాయి. గుంపులో నుండగా గుర్తింపలేము అంతేగాని అతడు లేకుండా పోడు. అట్లె గాలి గాలిలో కలిసిపోయినను, గాలి కూడా మిశ్రమ పదార్థమే. అందులో ఆమ్లజని, నత్రజని, ఉదజని, ౮౦, మొదలగునవి కలవు. వైదిక భాషలో ప్రాణ, పాన, వ్యానోదాన సమానములను వాయువులను, నాగ కూర్మ క్రూకర దేవదత్త ధనుంజయమును ఉపవాయువులు కలవు. ఇంకా ఇంకా మనకు తెలియని ఎన్నో తీరుల గాలులు కలవు.

అవన్నియు దేహము పోగానే అన్ని ఒకే గాలిలో అనగా బయటి గాలిలో కలిసినట్లు అగుపించును. కాని ప్రత్యేక ప్రక్రియ ద్వారా వెరు చేయవచ్చును. పాలు నీరు కలిసినచో హంస వేరుచేయుట లేదా? ఉప్పు శర్మర దాతులు నీటిలో కలుగు నామరూపాలు పైకి అగుపించకుండా పోయినట్లు తోచినను వేడిచేసి, ఆవిరిగా మరిగించి వేరుచేయటంలేదా?

అవి నీటిలో కలిసినట్లుగా, లీనవ్లైనట్లుగా సర్ధాలదృష్షికి అగుపించినను వాటి వ్యక్తిత్వం ఉనికి ఎక్కడికి పోవడం లేదు.

కోట్లాది శబ్దాలు మన మాటలు ఇతర రణగొణ ధ్వనులన్నియు కలిసినను రేడియో ద్వారాను, వైర్‌లెస్‌ ద్వారాను, మరి ఇతరములైన పరికరములతో మనకు కావలసిన ధ్వనులను వేరుగా చేసుకొని వినటం లేదా? అట్లే టి.వి.లో కోట్లాది రూపాలు ప్రతిబింబాలు విశ్వమంతటా వ్యాపించగా అందులో నుండి రావలసిన రూపాన్ని తిరిగి గ్రహించటము

32

లేదా? మనము చేయు ధ్వనిని గాని, మన రూపం గాని కోట్లాది సంవత్సరములైనను అవి తరంగాల రూపాలలో ప్రవహిస్తూ పోతూనే ఉంటుందని శాస్త్రవేత్తలు బుజువు చేయటం లేదా?

ఆకాశం, గాలి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన పలుచని తేలికైన పరమాణువుల సముదాయాలు. అవి పరిశుద్ధమైన పారదర్భకాలు. గాలి కాని, ఆకాశం కాని అగుపించకపోవటానికి కారణము కాంతికిరణాలు పరావర్తనం చెందకపోవటమే. మన కాంతి కిరణము ఒక వస్తువుకు తాకి అది మనకు కన్పిస్తుంది.

ఆకాశం, గాలి, అపారమైన పారదర్శకాలగుటచే అగుపడవు. తెల్లని బాగుగా పాలిష్‌ చేసిన గాజు తలుపులలో నుండి ఆవలి వస్తువులు క్షియర్‌గా అగుపించును. కాని అద్దాలు లేనట్టుగానే తోచును. మన కంటి సులోచనంలోని అద్దాలు అగుపించవు కదా? అద్దాలకు ఆవలనున్నవి అగుపించును.

కావున లీనమగుట అంటే సృష్టి సమయాన పరమాత్మ గర్భము నుండి విడి విడిగా విస్తరించిన చరాచర ప్రకృతి, భూతాలు వగైరాలు ప్రళయకాలాన తిరిగి పొట్టలోనికి సూక్ష్మాతి సూక్ష్మ పరమాణురూపంలో ప్రవేశించును.

లేదా పుణ్యతిశయమున పాపాది కర్మవాసనలు తొలగి జన్మ రాహిత్యము కలుగగా ఆత్మలు ప్రవేశించుచున్నవి.

ఒకడు చదువులో లీనమైనాడని అనగా వాడు చదువుగా మారినాడనా దాని అర్ధము? అందు తన్మయత్వము పొందినాదని దాని అర్థము. అంతేకాని నామరూపాలు లేకుండా పోయినాదని దాని అర్ధము కాదు గదా!

383

లీనమనగా ఒక మనిషి వేలాదిమంది గల గుంపులో కలసినట్లుగా ఆత్మ పరమాత్మలో కలియుట అని అర్ధము.

పరమాత్మ యుండు స్థానము త్రిపాద విభూతి. సమస్తమైన అండపిండ బ్రహ్మాందాలు అన్నియు కలసి ఒక పాదము మాత్రమే. కావున ఒక భాగము పోయి మూడు భాగములలో కలసిపోయినచో ఒకభాగం విడిగా కనిపించదు.

మూడు పావుల పాలలో ఒక పావు నీళ్లు కలిపినచో నీళ్లు పాలు వేరువేరుగా తెలియవు కదా! అలాగే ఆత్మ పరమాత్మలో లీనమవునని భావము.

లీనమునే పదవ్యాఖ్యానముచే భిన్నించి, ద్వైత, అద్వైత విళిష్టా ద్వైతాలు ఏర్పడినవి.

ద్వైతము దేహతత్వము

విశిష్టాదై తము - జీవతత్వము

అద్వైతము ఆత్మతత్వము

అన్నీ ఒకటే అయినా స్థితిలో అవి ఉండనే ఉన్నవి. జీవుడు అన్ని దశలలో, అన్ని తత్వములలో తరించి తీరవలసినదే.

ఒక రంగు బుట్టలో అన్ని రంగుదారాలు కలసి ఎలానేయబడినవో సిద్దాంతాలు అలాగుననే ఉన్నవి.

84

9. ఓంకారము

ఆత్మ 'ఓం' అన్నది ఒక శబ్దంగా చెప్పినప్పుడు దానితో తాదాత్యం చెప్పుకోవాలి. అది భాగాలతో చెప్పినప్పుడు - ఆత్మయొక్క పాదాలు భాగాలు పాదాలలో ఒకటిగా చెప్పుకోవాలి.

ఓం భాగాలు : - - - అర్థమాత్ర లేక అమాత్ర

పృథివి, అగ్ని బుగ్వేదము, భూలోకము, (బ్రహ్మ అనునవి ఓంకారము లోని '“అ” కారం కరుగగా, కలియగా, లీనమవగా మొదటి అంశంలో పుట్టినవి.

అంతరిక్షం, యజుర్వేదం, భువర్లోకం, సనాతనుడైన విష్ణువు ఓంకారములోని *ఉఊ కారము లీనమవగా రెండవ అంశగా పుట్టినవి.

నువర్గోకమ్ము సూర్యుడు, సామవేదము, స్వర్గలోకము, మహేశ్వరుడు, ఓంకారములోని 'మికారము కరుగగా మూడవ అంశలో పుట్టినవి.

“అ కారము పసుపు వర్ణము కలది, రజోగుణము వలన పుట్టినది.

“ఉ కారము తెల్లని వర్ణము కలది సత్వగుణం వలన పుట్టినది.

“మి కారము నల్లని వర్ణము కలది. అది తమోగుణము వలన పుట్టినది.

ధనుంజయా! అకార, ఉకార, మకారాదులు ఒకదాని నుండే పుట్టినవి. అదియే ఓం. అదియే జ్యోతి స్వరూపమైనది.

ప్రణవము అంతటను వ్యాపించునది. కావున ఏకము చేసి అభ్యాసము చేయవలయును.

తల్‌

ఇట్టి ప్రణవము

మూడు న్థానాలు

మూడు సూత్రాలు

ముగ్గురు బ్రహ్మలు

మూడు అక్షరాలు

మూడు మాత్రలు

మూడు అరమాత్రలు (౧

కలిగి యుండుట విశేషము

మూడు సూత్రాలు :

కర్మకాండ జైమిని పూర్వ మీమాంస

జ్ఞానకాండ

బ్రహ్మ -- ఉత్తర మీమాంస వ్యాసకృతము అపస్తంబ

మత అశ్వలాయన కాత్యాయన

ముగ్గురు బ్రహ్మలు :

సత్య

జ్డాన

అనంతం

386

మూడు అక్షరాలు : ట్‌

త్రిమాత్రలు :

బిందువు

-నాధమ కళలు

రెండు అరమాత్రలు :

కళాతీతము

అమవ్బాంగాలను, నాలుగు పాదములను, మూడు స్థానాలను, ఐదుగురు దేవతలను, ఓంకారమును తెలుసుకొనని (బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు. అష్టాంగగ చతుష్పాదాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు, 2 భుజాలు, 2 పాదాలు, 2 కరాలు, 1 ఛాతి, 1 నొసలు, ప్రణవార్దలో 1 భగవంతుడు, 1 అతని స్థూల 1 అతని సూక్ష్మ, 1 మహాశరీరాలు, 1 జీవం, 1 జీవస్టూలత, 1 జీవ సూక్ష్మత, 1 జీవ మహారూపకత. పంచ దైవతములు : వర వ్యూహ విభవ అంతర్యామి ఆర్పాదైవములు 3/

ఓంకారమే గ్రేష్టమైన రూపము. అదియే పరమాత్మగా పరివర్తనము చెందును. నేను ఓంకారమునందే ప్రవేశించుచున్నానని శ్రీకృష్ణపురమాత్ముడు అర్జునునకు తెలిపెను. దీనివల్లనే పుట్టించుట, రక్షించుట, గిట్టించుట జరుగును. ఇట్లు సృష్టి, స్థితి, లయములు ఓంకారము వల్లనే జరుగుచున్నవి.

భూర్చువస్సువః మొదలగు వ్యాహృతులచే శరీరము పరిశుభ్రమగు చున్నది. అట్లే ఓంకార ధ్వనిచేత మనస్సు పరిశుభ్రమగుచున్నది.

సమస్తమైన మంత్రాలకు ఓంకారము ప్రాణమని చెప్పబడుచున్నది. అందుకే సమస్తమైన అజ్ఞానము తొలగుటకు ఓంకారమును ధ్యానింప వలయును.

ప్రణవము యొక్క శిరస్సుననే ఆత్మ యుంటున్నది. దాని లక్ష్యము బ్రహ్మమనబడును. బాణాన్ని ధనస్సుతో సంధించి గురిపెట్టి లక్ష్యం వైపు విడిచినట్లు జాగురూకతతో, ఏకాగ్రతతో ఓంకారమున ఆత్మను సంధించి పరమాత్ముని వైపు వదలవలయును. ఓంకారమాధారంగా భగవంతుని చేరవలయునని భావము. ఇచ్చట ధనస్సు అనగా ఓంకారము ఆత్మ అనగా బాణము.

విధముగా నడచినచో అనగా బాణాన్ని గురిపెట్టి కొట్టినట్లుగ చేసినచో ఇహపర దృష్టి పోయి అంతర్జృష్టి ఏర్పడును. ఓంకారము నుండే వేదాలు జనించినవి. ఓంకారమే సమస్తమనబడును.

ఓంకారములో నుండియే మూడు లోకాలలోని నమన్థ చరాచరములు పుట్టుచున్నవి. ఓంకారమే న్రేష్టమైన రూపము. అదియు హృదయకమలము నందున్నది.

కావున సర్వశక్తి కలదియును అంతటను వ్యాపించినదియగు ఓంకారము ఒక్కదానినే అభ్యసించవలయును. ఓంకారమును పొట్టిగా పలికిన పాపములను నశింపచేయును. దీర్హముగా పల్మిన మోక్షము వచ్చును.

38

ప్రణవము యొక్క అర్ధము చెప్పుటకు శక్యము కాదు. దానిని తెలిసికొనిన వాడే తెలిసినవాడు. ఓంకారము వల్లనే శ్రీవిష్ణువు, త్రినేత్రుడు, బ్రహ్మ జన్మంచిరి.

“ఓంకారము మరియు “అధి అను రెండు పూర్వము బ్రహ్మయొక్క కుతికను ఛేదించుకొని వచ్చినవి. కావున రెండు పదాలును మంగళ దాయకములు. కావుననే ఓంకారున్ని అధ అను శబ్దాన్ని కావ్యారంభమున వాడుట జరుగుచున్నది.

అన్ని శబ్దాలలో ఓంకారము పరమోత్తమమైనది.

ఓంకారమే పరబ్రహ్మము. కావున ఓంకారమే (్రేష్టముగా స్మరించ తగినది. ఓంకారనాధమును వినుటచ్చే, కీర్తించుటచే మరియు జపించుటచే గూడ పరమపద ప్రాప్తి కలుగుచున్నది. కావున ప్రతినిత్యము అనగా ఎల్లప్పుడు ఓంకారమునందాసక్తి కలవాడవు కమ్మని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించెను.

దానిని పల్మినంత మాత్రముననే పరమాత్మను పొందెదరు. అగ్నిమయమైన అనగా తేజోవంతమైన రూపము ప్రణవోచ్చారణ చేయువారి యందు అధిరోహించియుండును.

“ఓం” ఒక్కటే నాశనము కాని పరబ్రహ్మత్మాకము. దీనిని ఎల్లప్పుడు మనస్సులో ఎవరు స్మరించుచు దేహాన్ని విడుస్తారో వారికి పరమపదము లభించును.

ఓంకారము అనే పదాన్ని ధ్యానించటం వల్లనే శ్రీవిష్ణువునకు విష్ణుత్వము, బ్రహ్మకు బ్రహ్మత్వము, శివునకు శివత్వము కలిగెను.

విష్ణుత్వమనగా - సర్వవ్యాపకత్వము

బ్రహ్మత్వమనగా - సర్వజ్ఞానము

89

శివత్వమనగా - మేలు కలిగించెడు శక్తి.

బ్రహ్మకు సృష్టించే శక్తి, శ్రీవిష్ణువుకు రక్షించే శక్తి శివునకు లయింపచేసే శక్తి ఓంకారము వల్లే వచ్చినవి.

భారతా! ఓంకారాన్ని మొదటగా నుంచి నాకు నమస్మారము చేయుము. నన్నే శరణు వేడుము. పార్దా! మోక్షము నిచ్చుచున్నానని గీతాచార్యుడు పలికెను.

అక్షరమే శ్రేష్టమైనది. అక్షరమును లెస్సగా గ్రహించి ఎవడు దేనిని కోరుచున్నాడో వానికి అది దొరకగలదు. ఓంకారమే వేదవేదాంత సారము మరియు

సర్వస్వము సర్వగము సర్వజ్ఞము సంపూర్ణము - సర్వము సర్వశక్తిత్వము సర్వసత్తాకము

0. సృష్టి - పంచబ్రమలు

అజ్ఞానమగు బ్రమ నుండి విముక్తినొందిన మాత్రమే జీవులు

తరింప గలుగుదురు.

క్షే

త్ర

శ్ర

జీవేశ్వరులు భిన్న రూపులనబడు భ్రాంతి మొదటి భ్రాంతియగును.

సూర్యబింబమునకును ప్రతిబింబమునకును బేధము లేదని తెలుసు కొన్నచో మొదటి భ్రాంతి తొలగును.

దీనినే “బింబ ప్రతిబింబ న్యాయము” అందురు.

ఆత్మయందు కర్త్షృత్వము వాస్తవముగ కలదను భ్రాంతి రెండవ భ్రమ యగును.

స్ఫటికమణికిన్ని దాని సంబంధమగు మెరుపు పుష్పముచే కలిగెడు స్ఫటికమందుగల రక్తవర్ణమునకును గల తత్వము గ్రహించినచో ఆత్మయందు కల కర్త్షృత్వ బ్రమ తొలుగును.

శరీర త్రయముతో గూడినవాదే జీవుడని గల భ్రమ మూడవ (భ్రమయగును.

ఫఘటమహాకాశము యొక్క నిజము తెలిసికొన్న ఆత్మ అసంగ స్వరూపమను బోధకలిగి సంగభమ నివృత్తియగును.

జగత్మారణమగు బ్రహ్మమమునకు వికారిత్వము కలదను భ్రాంతి నాల్గవ భ్రమయగును.

కనకకుండల కీరీట కంకణాదుల యొక్క తత్వము తెలిసికొనిన బ్రహ్మమునకు వికారిత్వము కలదను భ్రమ తొలుగును.

అట్టి కారణమగు బ్రహ్మము కన్న జగత్తు చిన్న్మయను సత్యబుద్ది ఐదవ ట్‌ ధే

భ్రమ యగును. రజ్జుసర్పదర్షనముచే కారణమునకు భఖీన్నముగా కార్యము లేదను

చోదనము కలిగిన జగత్సత్యత్వబుద్ది నివృత్తియగును. ద్‌

త్తే

"ల భక్తి - జ్ఞాన సందర్శనములు

పరభక్తియు, పరజ్ఞానమును ఒక్కటియె.

ఎవనిని వేదాంతులు, (బ్రవ్మమందురో వానినే యోగులు ఆత్మయనియు భక్తులు భగవంతుడనియు చెప్పుదురు. ఒకే బ్రాహ్మణుడు అర్చన చేయునవ్వుడు అర్బకుడనియు వంటచేయుటకై వినియోగింపబడినపుడు వంటబ్రాహ్మణుడని చెప్పబడును కదా!

నిజమైన జ్ఞానమనగా ఎట్టిది? జ్ఞాని ఇట్లు పలుకును.

పరమేశ్వరా! లోకమున నీవొక్కడవే కర్తవు. నేను నీ చేతిలోని అత్యల్పమైన ఉపకరణ మాత్రమును, నాదేమియు లేదు అంతయు నీదే. నేను, నా కుటుంబము, నా సంపదలు, నా గుణగణములు సమస్తము ఫ్‌;

ఒక భక్తుడు : ఒకానొకడు గృహస్థుడయ్యుండియు బ్రహ్మజ్ఞానము పొందెనని నీవెట్లు చెప్పగలవు.

శ్రీగురుదేవుడు ఏ; హరి నామము విన్నంతనే ఆశ్చవులును, గగుర్పాటును కలుగుటయే అందులకు గుతు. భగవన్నామ (శ్రవణ

మాత్రమున ఎవ్వని కన్నుల నుండి భాపష్పములు వెల్లివిరియునో ఎవ్వరికి రోమాంచమగునో అతడే జ్ఞాన లాభమును పొందినవాడు.

జ్ఞానమును భక్తియును సమన్వయించు ఒకానొక పురాణకథ గలదు. భగవానుడగు శ్రీరామచంద్రుడు తన ప్రియభక్తుడగు హనుమంతునిట్లడిగెను- వత్సా! నీవునన్నెట్లు ధ్యానింతువో, భావింతువో చెప్పుము.

త్తం

హనుమంతుడిట్లు విన్నవించెను. స్వామి దేహబుద్ధితో నేనునీ దాసుడను. జీవబుద్ధితో నేను నీ అంశను. ఆత్మబుద్ధితో నీవే నేను అనియు నాకు అనుభూత మగుచుండును.

చెరువులో నీటిపై తేలు చెత్తను పాచిని కొంచెము తొలగద్రోసిన ఎడల మరల వచ్చియవి నీటినావరించును. కాని వానిని బాగుగా తొలగించి ఎదురు కజ్జలలను అడ్డముగా కట్టినెడదల అవి మరల క్రమ్ముకొనజాలవు. అటులనే మాయను ఎన్నడో ఒకసారి నిరోధించిన ఎడల మరల వచ్చి యది మనలను భావించుచుండును. కాని హృదయమున భక్తి, జ్ఞానములను ఆవరణములను నిర్మించుకొనిన యెడల మాయ ఇక మననావరింపజాలదు. అప్పుడది శాశ్వతముగా తొలగిపోవును.

ఇదియే భగవత్సాక్షాత్మారము లభించు మార్గము.

భక్తిజ్లానముగా ఎట్లు పరిణమించును

అద్వైత జ్ఞానమే మహోత్తమము. కాని భగవంతుని మొదట సేవ్య సేవక భావముతో (అనగా భగవంతుడు ప్రభువనియు తాను సేవకుదనియు) ఉపాసింవవలయును. ఇదియే అత్యంత సులభమైన మార్గము. అచిరకాలములోనే అయ్యది మహోత్తమమగు అద్వైత జ్ఞానమును పొందించును.

అద్వైత జ్ఞానమే అత్యుత్తమయ్యును భక్తి క్రమమున నీవు మొట్టమొదట భగవంతుని ఉపాస్యునిగను నిన్ను ఉపాసకునిగను భావించుకొని భక్తి చేయ వలయును. అప్పుడు సులభముగా జ్ఞాన లాభము కలదు.

పంచభూతాత్మకమగు పంజరమున చిక్కి స్వయముగా బ్రహ్మమే రోధన చేయుచున్నది. తతి

కన్నులు మూసుకొని నీవు ముల్లు లేదు, ముల్లు లేదు అనుకొందువు గాక. కాని నీవు ముల్లును తాకినంతనే అది గ్రుచ్చుకొనుటచే “అబ్బా!” అని చేతిని ఈవలకు లాగుకొందువు. అటులనే జనన మరణములు, పుణ్య పాపములు, మొదలగు ద్వంద్వములకు అతీతుడవని, అఖండ సచ్చిదానంద బ్రహ్మమనియు నీవెంతగా భావించుకొనినను - శరీరమునకు వ్యాధియో సంభవించినను - మనస్సు విషయాకర్షనకు లోనై కామిని కాంచనమున తగుల్మొని పాపకార్యములు చేయ నిన్ను (పేరేపించినపుడు నీవు మోహితుడవగుచున్నావు. దుఃఖాదీనుడవగు చున్నావు. తుదకు అవివేకియై సత్ర్రవర్తనమును వీడి మాయాజాలమున చిక్కుకొనుచున్నావు.

కావున భగవంతుడు స్వయముగా కరుణింపనిదే- మహామాయ నీకొరకు మోక్షద్వారము తెరవనిదే నీవెన్నటికిని “ఆత్మసాక్షాత్మారముూను పొంది దుఃఖా తీతుడవు కాజాలవని గ్రహింపుము.

వరప్రదాతయైన యా శ్రీ శ్రీనివాసుడే ప్రసన్నమైనప్పుడు నరులు సంసార బంధ విముక్తులగుచున్నారు.

మహామాయ కరుణించి సాధకుని మార్గము నుండి ఒత్తిగిలిననె కాని బ్రహ్మసాక్షాత్మారము నీకెన్నటికిని కలుగదు.

భగవంతుడు తన కృపాకటాక్షమును వానిపై ఒరిపినంతనే అతడు ధన్యుడై భగవత్సాక్షాత్మారమును పొందును. సమస్త దుఃఖాతీతుడగును. లేనిచో నీవెంతటి వివేక వైరాగ్యాది సాధనలననుభవించినను అన్నియును నిష్రయోజనములే.

ఒక్క ఓమము పాయ నూరు మెతుకుల నరిగించును. అని చెప్పుదురు కాని జీర్ణకోశము చెడిపోయిన పక్షమున నూరు ఓమము పాయలైనను ఒక్క మెతుకును అరిగింపలేవు.

కం...

నిర్గుణ సాక్షాత్కారవేం జ్ఞానయోగి అభీవ్చము. కాని సర్వసాధారణముగా అట్టివాడే కలియుగమున భగవంతుని భజించుచు, (ప్రార్థించుచు, వానికి ఆత్మార్చ్పణవొనర్చుటయే (శేయన్మరమని చెప్పవలసియున్నది. భగవవానుడు తన భక్తిని రక్షించును. భక్తుడు తపించునేని బ్రహ్మజ్ఞానమును తప్పక యొసగును. జ్ఞానయోగి ఇట్లు భక్తి జ్ఞానములను రెండింటిని కూడా పొందవచ్చును

భక్తుడు సర్వసాధారణముగా సగుణ బ్రహ్మసాక్షాత్మారముతో తృప్తి నొందును. కాని భగవానుడు వానిని తన అఖండ ఐశ్వర్యమునకు వారసునిగా నొనర్చి భక్తిజ్లానములను రెంటివని గూడా ప్రసాదించును. సగుణ బ్రహ్మ సాక్షాత్మారమే గాక, నిర్గుణ బ్రహ్మసాక్షాత్మారము కూడా కలుగును.

ఎవ్వదైనను కలకత్తా చేరగల్లినచో అందలి మైదానమును, ఆక్టర్లోని స్తూపమును, మ్యూజియమును, చూడదగిన ఇతర వస్తువులను చూడజాలక పోవునా?

భక్తుడెన్నదైనను భగవంతునితో పరిపూర్ణ ఐక్యము పొందునా? ఐనచో ఎట్లు పొందును.

జీవాత్మ భగవంతునితో పరిపూర్ణెైక్యమును పొందును. అట్లు ఐక్యమును పొందునపుడే “నేనే బ్రహ్మమును అని చెప్పకలుగును.

ఇంటియందలి వృద్ధ సేవకుడు కాలక్రమమున ఇంటిలో ఒకడుగా పరిగణింపబడును. గృహయజమాని వాని సేవాతత్పరతను జూసి చాలా సంతోషించి యొకానొక దినమున వానిని తాను కూర్చండు గౌరవన్థానమున కూర్చుండబెట్టి, నాటినుండి తనకును, వానికిని భేదము లేదని తన చుట్టున్న వారికి చెప్పును. మరియు ఇతడును నేనును ఒక్కటియే.

త్న్‌

నాయెడ మీరు విధేయులై ప్రవర్తించు రీతిని ఈతని యెడల కూడ ప్రవర్తించుడి. అటుల చేయనివారు శిక్షాపాత్రు లగుదురని చెప్పును.

ఇట్టి గౌరవమును వాడు పొందుటకు వినయముచే సంకోచించినను యజమానుడే బలవంతముగా వానిని ఉత్తమాసనమున కూర్చుందబెట్టును.

చిరకాలము భగవంతుని సేవించి వానితో ఐక్యము నొందు భక్తుల విషయము కూడా ఇట్టిదే.

భగవంతుడు కృపాపూర్ణుడై తన అఖందైశ్వర్యమును, అనంత కళ్యాణ గుణములను అట్టి భక్తునకు ఒసగి వానికి స్వయముగా తనలోకేశ్వర పదవి ననుగ్రహించును.

భక్తుడు సర్వసాధారణముగా బ్రహ్మజ్ఞానము లభిషాసింపడు, కాని యాతడు శ్రీకృష్ణుని, శ్రీ శ్రీనివాసుని, శ్రీ పరమేశ్వరుని, లేక యా జగజ్జనని దివ్యావతారములనో సాక్షాత్మారించుకొన్నంత మాత్రముననే సంతుష్టుడగును.

సమాధి స్థితిలో తన ప్రత్యేకత నిర్మూలము కారాదని ఆతడు భావించును. బ్రహ్మమును పురుషోత్తమునిగా గాంచి అట్టి దివ్యానుభవము పొందుటకు తగినంత వ్యక్తిత్వము తనకుందవలెనని అతని అభిలాష అతడు పంచదార కాగోరడు. అతడు పంచదారను రుచిచూడదలచును.

శ్రీ శ్రీనివాసుడు తానే వేదాంతోక్తమగు బ్రహ్మమని వక్కాణించు చున్నాడు. అతదే అవాంకారమును నిర్మూలించి బ్రవ్మాజ్ఞానము నొసంగగలడు.

నిత్యమేది, అనిత్యమేది అను విచారణ మూలమునను నీవు ఇట్లు (బబ్రవ్మాజ్ఞానమును పొందవచ్చును. మరియు భక్తిమూలమునను బ్రహ్మజ్ఞానమును బడయవచ్చును.

46

భక్తి కోసము - వికాసము కోసము - ఆత్మ సమర్పణకోసము నిరంతరము అతనిని ప్రార్ధించుటయే భక్తియోగతత్వము.

వీని మూలమున మొదట అతని సాన్నిధ్యమును పొందుము. న్స్‌ ప్రార్ధన హృదయపూర్వకమైనచో అతడు ఆలకించి తీరునని నామాటగా నమ్ముము అని శ్రీ గురుదేవులు వచించిరి. కాని నీవందులకై వేచియుండవలయును.

అతని నిర్దుణ తత్వమును సాక్షాత్మరించుకొనెదలచితివా- మరల అతనినే ప్రార్ధింపుము. అతడు నీ ప్రార్థన ఆలకించెనేని - అతడు సర్వశక్తిమయుడు కదా - సమాధిస్థితిలో నీకాతని నిర్దణ తత్వము అనుభూతమగును.

ఇదియే ఆత్మ జ్ఞానము

ఇదియే బ్రహ్మ జ్ఞానము

త్వ

జ్ఞానికి - భక్తునకు మనోభావమున గల బేధము

సాధకులు ఇరుతెగలుగా కన్పించుచున్నారు. ఒకరిది మర్కట కిషోర న్యాయము, రెండవ తెగవారిది మార్దాల కిశోరన్యాయము.

ఇట్లే జ్ఞానమార్గమును నిమ్మామ కర్మమార్గమును అవలంబించువాడు మోక్షమునకు నస్వప్రయత్నముపై ఆధారవడును. భక్తిమార్గము నవలంబించువాడు, సమస్తము ఈశ్వరేచ్చచే జరుగుచున్నదని గ్రహించి పరిపూర్ణ విశ్వాసముతో వాని అనుగ్రహముపై ఆధారపడి వానికి సంపూరముగా ఆత్మార్పణ మొనర్చుకొనును.

ణి

అనగా జ్ఞానము-జ్ఞాన మార్గము - మర్కట కిషోరన్యాయము వంటిది, భక్తిమార్గము మార్జాల కిషోరన్యాయము వంటిది.

జ్ఞాని నేనే శుద్ధబ్రహ్మముననును. కాని భక్తుడు సర్వస్వము ఈశ్వరు విభూతియేయనును.

1) సమస్త ప్రపంచము - నేనే

2) సమస్త ప్రపంచము - నీవే

8) నేనే సేవకుడను - నీవు ప్రభువువు.

మూడు మనోభావములయందును ఏదేని ఒకదానియందు చక్కగా నెలకొని యుండువాడు మాత్రమే భగవత్సాక్షాత్మారము పొందగల్టును.

శివాంశముచే జన్మించునట్టివాడు జ్ఞానియగును. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య అను జ్ఞానము పొందుటయే వాని అదృష్టము.

కాని విష్ణువాంశముచే జన్మించినవానికి భక్తివిశ్వాసములెన్నడును కొరవడవు. నిత్యానిత్య వస్తు విచారణముచే, లేక తార్మిక జ్ఞానమహిమచే

తరి

తాత్మాలితముగా వాని భక్తి విశ్వాసము లొకప్పుడు క్షీణించినను సకాలమున అయ్యది యాదవకుల నాశనమైన ముసలము వలె విజ్బంభించును.

జ్ఞాని హృదయమున ప్రవహించు ప్రజ్ఞాన గంగ ఒకే దిశగా ప్రవహించును. వానికి సమస్త జగత్తును స్వప్ప్నతుల్యముగా తోచును. అతడు సదా ఆత్మయందే నెలకొనియుండును.

కాని భక్తుని హదయమందలి (ప్రేమగంగ యో సదా ఒకే దిశగా ప్రవహింపదు. దానిలో పోటు పాటులుండును. భక్తుడు ఒకప్పుడు నవ్వును, ఒకప్పుడు ఏడ్చును. ఒకప్పుడు ఆడును, ఒకప్పుడు పాడును.

భక్తుడు ఎల్లప్పుడు భగవత్సాన్నిధ్యముచే కలుగు ఆనందముననుభ వింపగోరును. సముద్రమున తేలియాడు మంచుకొండవలతె ఆయానంద సాగరమున ఒకానొకప్పుడు ఈదులాడుచు, ఒకప్పుడు మునుగుచు, ఒకప్పుడు తేలుచు అందే నెలకొనియుండ అభిలాషించును.

పురాణముల ప్రకారము భక్తుడు భగవంతునికంటె భిన్నుడు- భక్తుడు ఒక తత్వము - భగవంతుడు ఒక తత్వము.

దేహము - ఒక ఘటము వంటిది

మనోబుద్ధి, చిత్త, అహంకారములే - అందలి నీరు

బ్రహ్మము - సూర్యుని వంటిది

బ్రహ్మము అంతకరణమును నీటిలో ప్రతిబింబించుచున్నది. కావున భక్తుడు వివిధ దివ్యరూపములను దర్శించుచుండును.

కాని వేదాంత ప్రకారము బ్రహ్మయొక్కటియే సత్యము. మిగిలిన దంతయు మాయ - స్వప్నమువలె మిథ్య.

బ్రహ్మసాగరమున- నేను అను కట్టి పడియున్నది. కల్దిను నీవు తొలగించితివా అఖండ జలము (ఒక్కటియే) గోచరించును. కాని

త్న

కజ్టయున్నంత వరకు, జలము రెండు భాగములుగా విభజింపబడినట్లు కజ్దికు ఇరువైపుల కన్పించును.

నరుడు సమాధి స్ధితి పొందినంతనే బ్రహ్మజ్ఞానము ఉదయించును. అహంకారమపుడు నిర్మూలమగును. వేదాంత ప్రకారము జాగ్భతావస్థ కూడ మిథ్యయే.

నారదుడు మొదలగు ఆచార్యపురుషులు బ్రహ్మజ్ఞానమును పొందిన పిమ్మట కూడా లోకహితార్థము భక్తినవలంభించిరి.

జ్ఞానము పురుషుని వంటిది - భక్తి స్తీవంటిది. భగవంతుని కొలువు కూటము వరకే జ్ఞానమునకు ప్రవేశము లభించును. కాని భక్తి భగవంతుని అంతఃపురమున కూడ ప్రవేశించును.

ఒకప్పుడు ఒక జ్ఞాని ఒక భక్తుడు అరణ్యము గుండా పోవుచుండిరి. దారిలో వారికొక పెద్దపులి కన్పించెను.

మనము పారిపోవుటెందులకు? సర్వశక్తిమంతుడగు భగవంతుడు మనలను రక్షించును కదా? అన్నాడు జ్ఞాని.

కాదు అన్నా! మనము పరిగెత్తుదము. స్వప్రయత్నముచేతనే మనము నెరవేర్చగల పనికి భగవంతుని (ఛ్రమపెట్టుటెందులకు అన్నాడు భక్తుడు.

శ్రీ గురుదేవుడు : భక్తి చంద్రుని వంటిది. జ్ఞానమో సూర్యుని వంటిది.

ఉత్తర దక్షిణ ధృవములకడ సముద్రములు కలవనియు అందలి నీరు చాలావరకు మంచుగడ్డలుగా నేర్చడుననియు వానియందు ఓదలు చిక్కుకొను ననియు వినియున్నాను.

ఒక భక్తుడు : భక్తిమార్గమున కూడా జనులిట్లా మార్గమధ్యమున చిక్కుకొందురా ఏమి?

50

శ్రీ గురుదేవుడు : వెను చిక్కుకొందరు.